శోభనాచలుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శోభనాచలుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

శోభనాచలుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి టెట్‌ రద్దు చేయాలి నేటి నుంచి రైల్వే గేటు మూసివేత ఐఆర్‌ ప్రకటించేందుకు ఇంకెంత కాలం? విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలి

ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌.జయ సూర్య కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ ఈఓ సాయి, అర్చకులు ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. న్యాయమూర్తి జయసూర్య స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధానార్చకులు వేదాంతం శేషుబాబు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి, పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాసి అర్హత సాధించాలని నిబంధన విధించడం అన్యాయమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనను రద్దు చేయాలని ఎస్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు పీబీవీఎన్‌ఎల్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక సు బ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలో ఎస్‌టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ టెట్‌ రద్దు చేసే దిశగా పార్లమెంట్‌లో చట్టం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రధా న కార్యదర్శి కేఆర్‌ పవన్‌కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులను టెట్‌ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఐఆర్‌ ప్రకటించాలని, డీఏలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు వి.మురళీకృష్ణ, డీసీఈబీ సెక్రటరీ పి.సురేష్‌, మాజీ రాష్ట్ర నా యకులు డీవీఏవీ ప్రసాదరాజు, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎ.రాము హాజరయ్యారు.

కై కలూరు: రైలు పట్టాల మరమ్మత్తుల నిమిత్తం కై కలూరు–ఆకివీడు మధ్యలో భుజబలపట్నం నుంచి నర్సాయిపాలెం చేరే రైల్వే లెవిల్‌ క్రాసింగ్‌ గేట్‌ నం.88ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 28న రాత్రి 7 గంటలకు వరకు మూసివేస్తున్నట్టు సౌత్‌ కోస్ట్‌ రైల్వే కై కలూరు సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ (పీవే) అబ్దుల్‌ రెహ్మన్‌ శని వారం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నా య మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించడానికి ఇంకెంత సమయం కావాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు టి.నారాయణదాసు ప్రశ్నించారు. శనివారం స్థానిక ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. నారాయణదాసు మాట్లాడుతూ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని, లేకుంటే కేవలం వారి బోధన సబ్జెక్టుకు సంబంధించి మాత్రమే ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామారావు మాట్లాడుతూ వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వి.గణేష్‌, జిల్లా కార్యదర్శి డీకేఎస్‌ఎస్‌ ప్రకాష్‌రావు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు ఐఎస్‌వీవీ ప్రసాద్‌, నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్‌, జి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యమని విద్యుత్‌ ఎస్‌ఈ కేఎం అంబ్కేర్‌ అన్నారు. స్థానిక చిత్తూరు గణేశ్వరరావు టౌన్‌హాల్‌లో శనివారం జంగారెడ్డిగూడెం సబ్‌ డివిజన్‌ పరిధిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యఘర్‌ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలన్నా రు. ము ఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియో గదారులు లబ్ధి పొందేలా చూడాలని సూచించారు. విద్యుత్‌ శాఖ ఈఈ పీర్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఈఈ శశిధర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement