కై కలూరులో మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

కై కలూరులో మహిళ దారుణ హత్య

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

ఒంటిపై నగలు చోరీ

సమీప వ్యక్తి చేశాడని అనుమానం

కై కలూరు: నగలు కోసం ఓ మహిళను దారుణంగా కొట్టి చంపిన ఘటన కై కలూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానిక 8వ వార్డు కాల్వగట్టు సమీపాన ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న మార్టిన నాగరాజు, భార్య వరలక్ష్మీ(50) నివసిస్తున్నారు. సోదరుడి కూల్‌ డ్రింక్‌ షాపులో సహాయం చేయడానికి నాగరాజు వెళ్లాడు. వీరి కుమారుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి ఫోన్‌ లిప్ట్‌ చేయకపోవడంతో ఇంటి సమీపంలో తన స్నేహితుడికి ఫోన్‌ చేసి తల్లి వద్దకు వెళ్లమన్నాడు. అతను వెళ్లి చూసేసరికి వరలక్ష్మి నిర్జీవంగా పడి ఉంది. ఇదే విషయాన్ని అతను కుటుంబ సభ్యులకు తెలియశాడు. వారంతా వచ్చి చూడగా ఆమె ఒంటిపై నానుతాడు, చెవుల దిద్దులు, ఉంగరాలు, ఇంటిలో రూ.10వేలు కనిపించలేదు. ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. 108 సిబ్బంది రాగా అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఆమె ఇంటిలో నుంచి రావడం చూశామని సమీప వ్యక్తులు చెబుతున్నారు. అతను మృతురాలి కుమారుడి మరో స్నేహితుడు, సమీప వ్యక్తే అని తెలిసింది. ఖచ్చితంగా అతనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్‌.రామకృష్ణ, రూరల్‌ ఎస్సై వి.రాంబాబు ఘటనా స్థలంలో విచారణ చేశారు. స్థానికుల కథనం మేరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement