పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి

ద్వారకాతిరుమల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎరువులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం డిమాండ్‌ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో బుధవారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో ఎరువులు, పెట్రోల్‌, డీజిల్‌, ఖర్చులు పెరిగి రైతులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, తూంపాటి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement