ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిసాయి. ఉదయం ఆలయంలో ఐదు లక్షల గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారికి అర్చకులు విశేష కుంకుమ పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా ముత్తైదువలు ఆలయ మండపంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపిన చండీహోమం, పూర్ణాహుతి హోమంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు.


