తాడేపల్లిగూడెం: మట్టిరహిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన కూరగాయల నారును రైతులకు అందించడమే లక్ష్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొక్కలను తయారు చేస్తున్నామని వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. శనివారం విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో నామమాత్రపు ధరకే రైతులకు మొక్కలను అందజేశారు. ఈ పద్ధతిలో పెంచిన నారుకు తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని, నారు దశలోనే వ్యాధులను నివారిస్తామని పేర్కొన్నారు. మొక్కలు కావాల్సిన రైతులు వీఆర్ గూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వర్సిటీలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు జి.రామానందం, హెడ్ టి.సుశీల, శాస్త్రవేత్త ఎన్.వి.గౌతమ్ పాల్గొన్నారు. అంటుగట్టిన నారు కోసం 73826 33654 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
భీమడోలు: గుండుగొలనులో భర్త వేధింపులు తాళలేక వివాహిత శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన నరేడుమిల్లి సత్యం కుమార్తె శ్రావణికి(26) గుండుగొలనుకు చెందిన బర్నాన ఆదినారాయణతో 2016లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా భర్త మద్యం తాగొచ్చి గొడవ చేసేవాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మనస్తాపానికి గురైన శ్రావణి భర్త లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న మృతురాలి తండ్రి సత్యం అనుమానంతో అల్లుడు ఆదినారాయణపై ఫిర్యాదు చేసాడు. భీమడోలు సీఐ వి.కృష్ణ, ఎస్సై ఎస్‌కే మదీనా బాషాలు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భీమడోలు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలిశెట్టి పవన్‌కుమార్ (35) జల్లేరు నుంచి బైక్‌పై వస్తున్నాడు. ఆ సమయంలో జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్‌కుమార్ చెందాడు.


