వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ పదవులు
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా కార్యదర్శిగా సాసుపల్లి యుగంధర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏలూరు జిల్లా సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడిగా ఏలూరుకు చెందిన బండ్లమూడి సునీల్‌కుమార్, యువజన విభాగం కార్యదర్శిగా కందుల సంతోష్, బీసీ సెల్ కార్యదర్శిగా అట్టాడ రామకృష్ణను నియమించారు. నియోజకవర్గం పరిధిలో నగర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా అగ్గాల కృష్ణారావు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మునిశెట్టి సాయికుమార్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడి బుద్దాల రామును నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్సార్‌సీపీ మేధావుల విభాగం
సంయుక్త కార్యదర్శిగా రాజేష్ ఖన్నా
చింతలపూడి : వైఎస్సార్‌సీపీ మేధావుల విభాగం సంయుక్త కార్యదర్శిగా చింతలపూడికి చెందిన గడ్డమడుగుల రాజేష్ ఖన్నా(నాయుడు)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన దేవస్థానం సిబ్బంది క్వార్టర్స్ వద్ద శుక్రవారం రక్తపింజర పాము హడలెత్తించింది. గోసంరక్షణశాల సమీపంలోని గోబర్ గ్యాస్ యూనిట్ వద్ద కొందరు కార్మికులు పని చేస్తుండగా, రక్తపింజర పాము అటుగా వచ్చింది. కార్మికులు ధైర్యం చేసి దాన్ని హతమార్చేందుకు ప్రయత్నించగా, అది చాలాసేపు వారికి చిక్కలేదు. ఒకానొక దశలో కార్మికులపైకి దూకింది. ధైర్యం చేసి వారు ఎలాగోలా దాన్ని హతమార్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు (టూటౌన్): హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించడంతో పాటు సాక్షులను తారుమారు చేసిన విషయంలో మూడు సంవత్సరాలు జైలు, ఒక్కొక్కరికి రూ.3 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి ఎస్.శ్రీదేవి శుక్రవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018, మే17న ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలు వద్ద తూర్పువీధికి చెందిన తిరుమల రామశివ(34), పిచ్చుకలగుంటకు చెందిన కలవల నాగరాజు(34) శ్రీయాద్రి శ్రీ హర్షతో మద్యం విషయంలో గొడవపడి ఇనుప రాడ్డుతో కొట్టడంతో అతను చనిపోయాడు. కేసు దర్యాప్తు అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు.
తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా 72వ సీనియర్ పురుషులు, మహిళల కబడ్డీ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 22న తణుకు మాంటిస్సోరి స్కూల్ సమీపంలోని కబడ్డీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ బసవ రామకృష్ణ, అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా కార్యదర్శి వై. శ్రీకాంత్ తెలిపారు. క్రీడాకారులు మధ్యాహ్నం 2 గంటలకు తమ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, వివరాలకు 9642496117, 9491333906 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ పదవులు


