భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌ | - | Sakshi
Sakshi News home page

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

భీమడో

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌

రాష్ట్రంలో ప్రథమస్థానం.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

సర్టిఫికెట్‌ రావడం సంతోషంగా ఉంది

భీమడోలు: భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఎన్కస్‌ సర్టిఫికెట్‌కు ఎంపికై ంది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించే నేషనల్‌ క్వాలిలీ ఎస్యూరెన్స్‌ స్టాండర్స్‌(ఎన్కస్‌) సర్టిఫికెట్‌ను ఆసుపత్రి సొంతం చేసుకున్నట్లు ఆరోగ్యం కేంద్రం వైద్యులు తెలిపారు. నూటికి 87.99 శాతం మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచింది. ఈ సర్టిఫికెట్‌కు భీమడోలు, గుంటూరు జిల్లాలోని అర్బన్‌ పీహెచ్‌సీల అర్హత సాధించగా.. ప్రథమ స్థానంలో భీమడోలు సీహెచ్‌సీ నిలిచింది. ఈ సర్టిఫికెట్‌ సాధిస్తే మూడేళ్ల వరకు ఆసుపత్రికి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి.

భీమడోలు ఆసుపత్రిలో గత నెల 26, 27ల్లో ఎన్కస్‌ బృందం విస్తృత తనిఖీలు చేసింది. రోగులకు అందించే సేవలు, వసతులు, అందుబాటులో మందులు, మౌలిక వసతులు, వైద్య సేవలపై పరిశీలించారు. ఆసుపత్రుల్లో వార్డులు, ఐసీయు, ఆపరేషన్‌ థియేటర్‌ల్లో పరిశుభ్రత, నర్సులు, సిబ్బంది పరిశుభ్రత, రోగులకు అందుబాటులో మందులు తదితర అంశాలపై నిశితంగా పరిశీలన చేశారు. వారికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సునీతతో పాటు వైద్యబృందం సభ్యులు సహకరించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయాంలో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఓపీ బ్లాక్‌ ఇరుగ్గా ఉండడంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఓపీ బ్లాక్‌ నిర్మాణానికి రూ.2.30 కోట్లు మంజూరు చేయించారు. దీంతో కార్పొరేట్‌ ఆసుపత్రికి ధీటుగా ఓపీ బ్లాక్‌ను నిర్మించారు. అధునాతన వైద్య పరికరాలను అందించడంతో పాటు స్పెషలిస్ట్‌ వైద్యులను నియమించారు. గైనిక్‌, జనరల్‌ సర్జన్‌, జనరల్‌ ఫిజిషియన్‌, దంత, మత్తు, పిల్లల వైద్యులు, దీర్ఘకాలిక రోగాల నిపుణులు వైద్యులు పోస్టులున్నాయి. 90 శాతం వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది ఉండడంతో రోగులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి.

భీమడోలు సీహెచ్‌సీలో గత ప్రభుత్వంలో నిర్మించిన ఓపీ బ్లాక్‌

సీహెచ్‌సీలో వసతులు పరిశీలించిన ఎన్కస్‌ టీం సభ్యులు

ఈ సర్టిఫికెట్‌ ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ ఆసుపత్రిలో వైద్య బృందం సహాయ సహకారాలతో ఎన్కస్‌ నిబంధనలు పాటించాం. రోగులకు అందించే సేవలు, పరిసరాలు, వైద్యులు, సిబ్బంది నిబద్ధతను బృందం పరిశీలించింది. దీంతో 88 శాతం మార్కులు సాధించాం. దీని వల్ల మా బాధ్యత పెరిగింది.

– డాక్టర్‌ ఎన్‌.సునీత, ఆసుపత్రి సూపరిండెంటెంట్‌, సీహెచ్‌సీ, భీమడోలు

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌ 1
1/2

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌ 2
2/2

భీమడోలు సీహెచ్‌సీకి ఎన్కస్‌ సర్టిఫికెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement