భక్తుల రద్దీపై అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీపై శుక్రవారం అమావాస్య ఎఫెక్ట్ చూపింది. నిత్యం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారు. అమావాస్య కావడంతో ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రాక స్వల్పంగా ఉంది. దాంతో మధ్యాహ్నం వరకు ఆలయ పరిసరాల్లో నామమాత్రంగా భక్తులు సంచరించారు. 3 గంటల తరువాత నుంచి దాదాపుగా అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తుల లేమితో కనిపించాయి.
భీమవరం: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలకు భీమవరం పట్టణంలోని సీఎస్‌ఎన్ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దావూద్‌ఖాన్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో పోటీలకు ఎంపికై న ఎం.బేబీ రాణి, కె.హనూక్‌ను కళాశాల సెక్రటరీ అండ్ కర్సపాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ అభినందించారు.
తణుకు అర్బన్: ఐషర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. తణుకు పట్టణ ఎస్‌సై కె.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళ్తుండగా తణుకు సమీపంలోని జాతీయ రహదారి పాత టోల్‌గేటు వద్ద ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐషర్ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నెల్లి శ్రీను ఫిర్యాదు మేరకు ఎస్‌సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భక్తుల రద్దీపై అమావాస్య ఎఫెక్ట్
భక్తుల రద్దీపై అమావాస్య ఎఫెక్ట్


