అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేస్తామని జీసీసీ నోడల్ అధికారి, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సూర్యనారాయణ తెలిపారు. మండలంలోని ముంజులూరుతోపాటు చింతల్లి, గడ్డపల్లి గ్రామాల్లో శుక్రవారం జీఎం లక్ష్మితో పాటు జీసిసీ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లాడుతూ 2026 ఆర్థిక సంఘానికి సంబంధించి గిరిజన సహకార సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు నిర్థిష్టమైన ధరలు నిర్ణయించామని, పిక్క తీసిన చింతపండు రూ.67, పిక్కతో ఉన్న చింతపండు రూ.36, గానుగ గింజలు రూ.25, ఇప్పగింజలు రూ.29, తబిస జిగురు రూ.114, ముష్టి గింజలు రూ.100, కరక్కాయ రూ.18, తానికాయలు రూ.18, నల్ల జీడిపిక్కలు రూ.35, షీకాయ రూ.40గా రేటు నిర్ణయించామన్నారు.
ఉంగుటూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నెల రోజులు వ్యవధిలో 37 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరిచారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో ఉంగుటూరు టోల్ ప్లాజా, నారాయణపురం, చేబ్రోలు, కై కరం సెంటర్లలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


