వ్యాపారం విలవిల | - | Sakshi
Sakshi News home page

వ్యాపారం విలవిల

Dec 14 2025 8:37 AM | Updated on Dec 14 2025 8:37 AM

వ్యాప

వ్యాపారం విలవిల

ఉత్సాహంగా బాలోత్సవం నవోదయ ప్రవేశ పరీక్షలకు 1,184 మంది హాజరు షాపుల కోసం సిఫార్సులు గతంలో ఎప్పుడూ చూడలేదు ●

మనీ రొటేషన్‌తో నాడు కళకళ

నేడు వెలవెల

ఉత్సాహంగా బాలోత్సవం
ట్రిపుల్‌ ఐటీని గాలికొదిలేసిన ప్రభుత్వం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావాన్ని బాలోత్సవాలు పెంపొందిస్తాయని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్‌ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. సిద్ధార్థ క్వెస్ట్‌ విద్యా సంస్థల ఆవరణలో హేలాపురి బాలోత్సవం 2వ రోజు ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది. ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను, శాస్త్ర సాంకేతిక ఆలోచన విధానాన్ని పెంపొందించే విద్యా వ్యవస్థ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సెట్‌వెల్‌ సీఈఓ కేఎస్‌ ప్రభాకర్‌, బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, అకడమిక్‌ అంశాల సమన్వయకర్త ఎస్‌కే ముస్తఫా అలీ, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్‌ బాబు, ఎన్జీవో అసోసియేషన్‌ నాయకుడు చోడగిరి శ్రీనివాస్‌, పూర్వ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్‌, హెయిర్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కేకే గుప్త, జీఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవంలో కథలు చెప్పడం, మైక్రో ఆర్ట్‌, క్విజ్‌, జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, లఘు నాటికలు, చిత్ర సమీక్ష తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్జీయూకేటీ అధికారులు విఫలమయ్యారని ఏఐఎస్‌ఎఫ్‌ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీ శివకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తింటున్న భోజనాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనేక మంది విద్యార్థులను ఉన్నతస్థాయిలో నిలబెట్టిన విద్యాసంస్థ నేడు పూర్తిగా సమస్యలతో నిండిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇంత వరకు పీయూసీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, యూనిఫాం అందించలేదన్నారు.

సాక్షి, భీమవరం: భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, మల్టీఫ్లెక్స్‌ ఏరియా, నరసాపురంలోని స్టీమర్‌ రోడ్డు, తణుకులోని వేల్పూర్‌ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్‌ సెంటర్‌, టెంపుల్‌ రోడ్డు, తాడేపల్లిగూడెం కేఎన్‌ రోడ్డు, తాలుకా ఆఫీస్‌ రోడ్లు వ్యాపారాలకు పేరొందాయి. దసరా, దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి, రంజాన్‌, పెళ్లిళ్ల సీజన్లలో రెడీమేడ్‌, ఫ్యాన్సీ, కిరాణ, బంగారం, హోంగూడ్స్‌ తదితర వాటిపై రూ.2 వేల కోట్లకు పైనే వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న వ్యాపారులు సైతం ఆయా సీజన్లకు నెల ముందే ఢిల్లీ, ముంబై, చైన్నె తదితర నగరాల నుంచి స్టాకులు పెట్టుకునేవారు. కొంతకాలంగా మార్కెట్‌లో వినియోగదారులు లేక అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో నష్టాలతో నడపలేక కొందరు వ్యాపారాలను మూసివేస్తుండటంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. ప్రధాన సెంటర్లలో సైతం షాపుల ముందు టు–లెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఉపాధి కోసం రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు పెరుగుతున్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి సీజన్‌ మొదలుకానుండగా వ్యాపార వర్గాల్లో ఆ జోష్‌ కనిపించడం లేదు. జనం దగ్గర డబ్బుల్లేక మార్కెట్‌లో మనీ ట్రాన్సాక్షన్‌న్‌ తగ్గడం వ్యాపారాలపై ప్రభావం చూపిందని, మునుపటితో పోలిస్తే గత ఏడాది సీజన్‌లో 60 శాతం వ్యాపారం తగ్గినట్టు తాడేపల్లిగూడెం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన నేత ఒకరు తెలిపారు.

నరసాపురం: చైన్నె నుంచి విజయవాడ వరకూ నడుస్తున్న ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌–విజయవాడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రేపటి నుంచి జిల్లాలో పరుగులు పెట్టనుంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నరసాపురం రైల్వేస్టేషన్‌లో ఈ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. నరసాపురం–చైన్నె మధ్య ఈ రైలు ప్రతి రోజు రాకపోకలు సాగించనుంది. 20678 నెంబరుతో రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 12.45 గంటలకు చైన్నె చేరుకుంటుంది. 20677 నెంబరుతో చైన్నెలో ఉదయం 5.35 గంటలకు చైన్నెలో బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. నరసాపురం, భీమవరం టౌన్‌, గుడివాడ స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది. పశ్చిమ డెల్టా వాసులు ఎంతోకాలంగా ఈ రైలు కోసం ఎదురు చూస్తున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ నిర్వహించిన ఈ పరీక్షకు 2,311 మందికి 1,184 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు 1127 మంది గైర్హాజరయ్యారు.

ఉద్యోగాలు, ట్రాన్స్‌ఫర్లు కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల రికమండేషన్లకు డిమాండ్‌ ఉండటం చూస్తుంటాం. తణుకులో షాపులు ఖాళీ అయితే వాటికి కూడా రికమండేషన్ల కోసం వ్యాపారులు ఎగబడేవారు. అంతలా వ్యాపారాలు బాగుండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా షాపులు టు–లెట్‌ బోర్డులతో కనిపిస్తున్నాయి.

– కారుమూరి వెంకటనాగేశ్వరరావు, మాజీ మంత్రి

ఎన్నో ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాం. గతంలో పండుగల వ్యాపారం బాగా జరిగేది. గత ఏడాది అమ్మకాలు తగ్గిపోయాయి. మార్కెట్‌ డల్‌గా ఉండటంతో చిన్నవ్యాపారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.

జగదీష్‌, రెడీమేడ్‌ వస్త్రవ్యాపారి, తణుకు

తణుకులోని వేల్పూరు రోడ్డు.. క్లాత్‌, రెడీమేడ్‌, ఫ్యాన్సీ, ఫుట్‌వేర్‌, హోమ్‌నీడ్స్‌, షాపింగ్‌ మాల్స్‌కు ప్రసిద్ధి. గతంలో ఈ రోడ్డులో అద్దెకు షాపు కోసం మంత్రి స్థాయిలో సిఫార్సులు ఉండేవంటే వ్యాపారాలు ఎంత బాగుండేవో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోడ్డులోని కప్పల అప్పన్న సెంటర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ సెంటర్‌ వరకు కేవలం 550 మీటర్ల పరిధిలో 30కు పైనే షాపులు టు–లెట్‌ బోర్డులతో ఖాళీగా కనిపిస్తున్నాయి.

జగన్‌ ప్రభుత్వంలో అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, రైతు భరోసా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం.. అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ ప్రతీనెల ఏదొక సంక్షేమ పథకం చేతికంది మార్కెట్‌లో మనీ రొటేషన్‌ జరిగేది. ఉదాహరణకు 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు సంక్షేమం రూపంలో రూ. 1,191 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. గ్రామగ్రామాన జగనన్న కాలనీల్లో రూ.1263 కోట్లతో చేపట్టిన పక్కా ఇళ్లు, రూ.260 కోట్లతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్లు నిర్మాణాలు, నాడు–నేడులో రూ. 369 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ. వందల కోట్లతో జిల్లాలో ఆక్వా వర్శిటీ, మెడికల్‌ కళాశాల, ఆస్పత్రుల అభివృద్ధి పనులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యానికి భరోసా, మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ జోరుతో భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లోని కార్మికులు, వ్యాపారులకు ఏడాది పొడవునా పని దొరికి చేతినిండా డబ్బులతో వ్యాపారాలు కళకళలాడేవి.

సూపర్‌ సిక్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాది కాలంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్‌ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహన సేవ పథకాల ద్వారా జిల్లా వాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం చేసిన మేలులో ఇది కేవలం మూడో వంతు మాత్రమే. మరోపక్క విద్యుత్‌ చార్జీలు, ఇంటిపన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.

నరసాపురం–పాలకొల్లు రోడ్డులో గతంలో అక్కడక్కడ శీతల పానీయాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు కనిపించేవి. కొంతకాలంగా రోడ్డుకు ఇరువైపులా దారిపొడవునా గృహోపకరణాలు, సీజనల్‌ పండ్లు, కాయలు తదితర చిరువ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని భీమవరం–తణుకు, ఉండి – ఏలూరు, తణుకు–తాడేపల్లిగూడెం హైవే, తదితర రద్దీ రోడ్లలో పదుల సంఖ్యలో చిరు వ్యాపారాలు వెలుస్తున్నాయి.

మార్కెట్‌లో తగ్గిపోయిన మనీ రొటేషన్‌

బేరాల్లేక షాపులు ఖాళీ చేస్తున్న వ్యాపారులు

బిజినెస్‌ ఏరియాల్లోనూ షాపుల ముందు టు–లెట్‌ బోర్డులు

గత ప్రభుత్వంలో సంక్షేమ పరవళ్లతో వ్యాపారాల జోరు

2023లో పేదలకు చేకూరిన సంక్షేమ లబ్ధి రూ.1,191 కోట్లు

2025లో చేకూరిన లబ్ధి కేవలం రూ.409 కోట్లు

వ్యాపారం విలవిల 1
1/6

వ్యాపారం విలవిల

వ్యాపారం విలవిల 2
2/6

వ్యాపారం విలవిల

వ్యాపారం విలవిల 3
3/6

వ్యాపారం విలవిల

వ్యాపారం విలవిల 4
4/6

వ్యాపారం విలవిల

వ్యాపారం విలవిల 5
5/6

వ్యాపారం విలవిల

వ్యాపారం విలవిల 6
6/6

వ్యాపారం విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement