కోటి సంతకాల ర్యాలీని విజయవంతం చేద్దాం
జిల్లా పార్టీ అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా సేకరించిన వినతిపత్రాలతో ఈ నెల 15న సోమవారం ఏలూరులో జరిగే శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కోరారు. కై కలూరు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు ఆటపాక వినాయక ఐస్ ప్లాంట్‌కు సోమ వారం ఉదయం 8 గంటలకు రావాలని కోరారు. అక్కడ నుంచి ఏలూరు వెళ్లి శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలని డీఎన్నార్ కోరారు.
బుట్టాయగూడెం: ఐటీడీఏ ద్వారా చేపట్టిన అన్ని రకాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. పీఎం జన్‌మన్ పథకంలో చేపట్టిన పనులను ఐటీడీఏ పీవో రాములు నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన భవనాలు, రోడ్లు తదితర పనులన్నీ నిర్ణీత సమయానికి పూర్తిచేయాలన్నారు. బూసరాజుపల్లి గురుకుల పాఠశాలను, వసతి గృహంలోని వంటలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఇన్‌చార్జి వీసీ కె.ధనుంజయరావు
తాడేపల్లిగూడెం: ఉద్యాన వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు సేవలు అందించడానికి ప్రయత్నిస్తానని ఇన్‌చార్జి వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. నూతనంగా నియమితులైన ఆయన శనివారం వెంకట్రామన్నగూడెంలోని పరిపాలనా భవనంలో విలేకర్లతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ పనిచేస్తుందన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టీకల్చర్ హబ్‌గా రూపొందించి నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వర్సిటీ పనిచేస్తుందన్నారు. ధనుంజయరావుకు ఉద్యాన శాస్త్రవేత్తగా , యూనివర్సిటీ ఆఫీసర్‌గా 30 సంవత్సరాల అనుభవం ఉంది. సమావేశంలో రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో నిర్వహిస్తారని ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్. దేవప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ డెల్టా రబీ పంటకు సంబంధించి నీటి లభ్యత, అనంతరం కాలువలు మూసి వేసే తేదీ తదితర అంశాలపై చర్చిస్తారని చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 4వ రోజున శనివారం 374 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 200 మందికి 187 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరీక్షకు 200 మందికి 187 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు.
జంగారెడ్డిగూడెం: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ టి.మణిదివ్య, పరింపూడి వీఆర్‌వో బి.వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారని ఆర్డీవో ఎంవీ రమణ తెలిపారు. తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.
కోటి సంతకాల ర్యాలీని విజయవంతం చేద్దాం


