చిట్టీల పేరుతో మోసంపై ఆందోళన
కొయ్యలగూడెం: చిట్టీల పేరుతో తూర్పుపేటలోని ఒక వ్యక్తి తమను బురిడీ కొట్టించాడని ఆ ప్రాంతవాసులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. తూర్పుపేట పరిసర ప్రాంతాలలో వందలాది మంది నుంచి ఒక వ్యక్తి సుమారు రూ.10 కోట్ల మేర చిట్టీల పేరుతో సొమ్ము వసూలు చేశాడని తీరా ఇప్పుడు మొహం చాటేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో చిట్టీల నిర్వాహకుడికి సంబంధించిన చేపల పేటలో ఉండే అతని పొలం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. నిర్వాహకుడు తన పొలాన్ని కొందరు వ్యక్తులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో వారు వెళ్లి ఆందోళన చేశారు.


