ద్వారకాతిరుమల: శ్రీవారిపై తనకున్న నమ్మకం.. ఇష్టమే ఎనిమిది పదుల వయస్సులోనూ దీక్ష చేపట్టేలా చేసిందని ఒంగోలుకు చెందిన నీలంరాజు సీతమ్మ అన్నారు. కొద్ది రోజుల క్రితం గోవింద దీక్షను చేపట్టిన ఈమె, నియమ నిష్ఠలు, భక్తి ప్రపత్తులతో దీక్షను పూర్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఇరుముడులను ధరించి, కుటుంబ సభ్యులతో కలసి ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ఇరుముడులను సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించారు. ఇప్పటికే అయ్యప్ప దీక్షను కూడా పూర్తి చేసినట్టు సీతమ్మ తెలిపారు. ఇదిలా ఉంటే మనస్సు నిండుగా భక్తి ఉంటే.. వయస్సుతో సంబంధం లేదని సీతమ్మ నిరూపిస్తున్నారని పలువురు భక్తులు కొనియాడారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న లాక్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో చిత్ర బృందం విడుదల చేసింది. కార్యక్రమంలో సీనియర్ నటుడు గౌతమ్ రాజు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం రూపుదిద్దుకుందని, చిత్రంలో నటించిన నటీనటులంతా దాదాపు కొత్తవారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా పాత్రలకు జీవం పోశారని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జోషి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రానికి శుక్రవారం కాలినడక భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం కావడంతో పాదయాత్రగా వచ్చే భక్తుల సంఖ్య ఈ వారం అధికంగా ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన భక్తులు భీమడోలు మీదుగా, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా విచ్చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల భక్తులు జంగారెడ్డిగూడెం–కామవరపుకోట మీదుగా క్షేత్రానికి చేరుకున్నారు. కాలినడక భక్తులకు దేవస్థానం ఉచిత అన్నప్రసాదాన్ని అందజేసింది.
శ్రీవారిపై నమ్మకంతోనే..
శ్రీవారిపై నమ్మకంతోనే..


