గురువుల్లో టెట్ గుబులు
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులంతా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు గురువుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఇది గుదిబండగా మారింది. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇబ్బంది గా ఉన్న టెట్ నిబంధనపై కూటమి ప్రభుత్వం రి వ్యూ పిటిషన్ వేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2011కి ముందు డీఎస్సీల ద్వారా నియామకమైన ఉపాధ్యాయులంతా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. టెట్‌లో ఉత్తీర్ణులు కాకుంటే ఉద్యోగాన్ని ఒదులుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ప్రతిఒక్కరూ ఉపాధ్యాయులుగా కొనసాగేందుకు, ఉద్యోగోన్నతులు పొందేందుకు టెట్ అర్హత తప్పని సరిచేసింది. అయితే దాదాపు 30 ఏళ్ల నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు కూడా ఇప్పుడు టెట్ రాయాలనడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఎప్పటి నిబంధనలు అప్పటి వరకే ఉండాలని, కొత్త నిబంధనలు గతంలో ఉద్యోగాలు సాధించిన వారు కూడా అనుసరించాలనడం సరికాదని అంటున్నారు.
2011కు ముందు చేరిన వారిపై..
రాష్ట్రంలో 2011 ముందు చాలా డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. జిల్లాస్థాయిలో వందలాది మంది ఉద్యోగాలు సాధించారు. అప్పటి నిబంధనల మేరకే అప్పటి ప్రభుత్వాలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. 2009లో కేంద్ర ప్ర భుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో టెట్ అర్హతను తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాలు టెట్ పరీక్షను నిర్వహిస్తూ కొత్తగా ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు వెయిటేజీ ఇస్తున్నా రు. అయితే కొత్త చట్టంలోని నిబంధనలు అప్పటికే ఉద్యోగాలు సాధించినవారు పాటించాలనడం సరికాదని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
సుమారు 6 వేల మందిలో టెన్షన్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 11,500 మంది ఉపాధ్యాయు లు ఉన్నారు. వీరిలో 2000 కంటే ముందుగానే ఉ ద్యోగాల్లో చేరిన వారు కూడా ఉన్నారు. వీరంతా దా దాపు 25 ఏళ్లకు పైగా సర్వీసును పూర్తి చేసుకు న్నారు. మొత్తంగా చూస్తే 2000–2011 మధ్య ఉ ద్యోగంలో చేరిన వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేల మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు టెట్ అర్హత సాధించాల్సి ఉంది. వారిలో 50 ఏళ్ల దాటి రక్తపో టు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బా ధపడేవారు కూడా ఉన్నారు. ఒక పక్క వ్యాధులతో సతమతమవుతూ, ప్రభుత్వ యాప్‌లను పూర్తి చేస్తూ, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూ తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. పాతికేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తాము ఇప్పుడు కొత్తగా ఏం నిరూపించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.
అర్హత పరీక్షపై ఆందోళన
ఉత్తీర్ణత తప్పదన్న సుప్రీంకోర్టు
2011కు ముందు చేరిన వారిపై ప్రభావం
ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేల మంది టీచర్లు
గురువుల్లో టెట్ గుబులు


