విధుల్లో నిర్లక్ష్యం సహించం
ఏలూరు(మెట్రో): విధుల్లో నిర్లక్ష్యం, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేది లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పర్యాటక శాఖకు చెందిన ప్రదేశాల్లో టాయిలెట్లు నిర్మాణ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం ఆమె జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లకు టాయిలెట్లు మంజూరు చేసి మూడు నెలలు దా టినా ఇప్పటికీ నిర్మించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామవరపుకోట, జీలుగుమిల్లి, కై కలూరు, ము దినేపల్లి, పోలవరం, కలిదిండి మండలాల ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ, 24 గంటలలోపు పనుల్లో పురోగతి ప్రదర్శించని అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సీపీఓ వాసుదేవరావు అధికారులు పాల్గొన్నారు.


