కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు
గణపవరం: ప్రజావ్యతిరేక పాలనతో కంటగింపుగా మారిన కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాలతో నిలదీద్దామని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పా ల వాసుబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని పిప్పరలో రచ్చబండ, కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వ రంలా మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన అను యాయులైన ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను జగన్ నిర్మిస్తే, చంద్రబాబు మాత్రం వాటిని ప్రైవేటుపరం చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు ప్రణాళికలు వే శారన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులకు శాపంగా మారనుందన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని, ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన కో రారు. ఎంపీపీ అర్ధవరం రాము, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నడింపల్లి సోమరాజు మాట్లాడారు. వైఎస్సార్‌సిపి రైతు విభాగం కన్వీనర్ వెజ్జు వెంకటేశ్వరరావు, స్టేట్ యూత్ కమిటి కన్వీనర్ కమ్మిల భాస్కరరాజు, నాయకులు ఇందుకూరి నర్సింహరాజు, వీరవల్లి తాతయ్య, మాజీ మంత్రి చెరుకువాడ రంగరాజు కుమారుడు చెరుకువాడ నరేష్, సర్పంచ్‌లు దుళ్లకుటుంబరావు (మొయ్యేరు), మీసా ల సురేష్ (వెంకట్రాజపురం), అడబాల రవి (వీరేశ్వరపురం), కర్రి శ్రీనివాసరెడ్డి (ము ప్పర్తిపాడు), ఆదిమూలం సురేష్ (వాకపల్లి), ఎంపీటీసీ సభ్యుడు పెచ్చెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


