మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
దెందులూరు: పేదలకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో దెందులూరు ఎంపీపీ బొమ్మన బోయిన సుమలత, పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్ నాని అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ జగన్ ముద్ర రాష్ట్రంలో ఉండకూడదనే దుర్మార్గపు ఆలోచనతో పేదలకు కీడు చేయాలని చూస్తే కూ టమికి పతనం తప్పదన్నారు. విద్యార్థులు, ఎన్‌జీఓ లు, మహిళలు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నారని, కూటమికి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పార్టీ జిల్లా కార్యదర్శి డీబీఆర్‌కే చౌదరి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్ట గంగరాజు, పార్టీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు గూడపాటి పవన్‌కుమార్, ఎంపీటీసీలు సున్నా నరేష్ రోహిణి, ని యోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ తలారి రామకృష్ణ మాజీ సొసైటీ చైర్మన్ డీఎన్‌వీడీ ప్రసాద్, కొమ్మిన రాము తదితరులు పాల్గొన్నారు.


