ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలని చెప్పడం హేతుబద్ధంగా లేదు. దాదాపు 20–25 ఏళ్లపాటు అంకితభావంతో విధులు నిర్వహించిన వారు ఇప్పుడు ఒత్తిళ్లతో టెట్ రాయడం, ఉత్తీర్ణత సాధించడం ఆచరణ సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేసి సీనియర్ ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలి.
– గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలి. కొత్తగా చేసిన చట్టం ప్రకారం పాతతరం వారిని కూడా ఈ నిబంధనలకు లోబడే అర్హత సాధించాలనడం సరికాదు. అప్పటి పరిస్థితుల మేరకు పోటీ వాతావరణంలో నెగ్గుకొచ్చి ఉద్యోగాలు సాధించిన వారిని మరోసారి పరీక్షలంటూ వేధించడం తగదు.
– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్.
టెట్ నిబంధనను సవరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం చేయాలి. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టుపడితే అసాధ్యమేమీ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని ఈ విషయంలో వినియోగించి సీనియర్ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పాలి.
– వి.రామ్మోహన్, వైఎస్సార్‌టీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి
హేతుబద్ధంగా లేదు
హేతుబద్ధంగా లేదు


