జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాల తొలగింపు
చాట్రాయి: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలను కాంట్రాక్టర్ తొలగించిన సంఘటన మండలంలోని కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామంలోని 3వ లేఅవుట్‌లో గత ప్రభుత్వంలో 30 మంది లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి, రోడ్డు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేశారు. అయితే అనివార్య కారణాల వలన లబ్ధిదారు లు ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ నేపథ్యంలో వి ద్యుత్ స్తంభాలు వేసిన కాంట్రాక్టర్ గురువారం లేఅవుట్‌లోని నాలుగు స్తంభాలను తొలగించి మరోచోటుకు తరలించారు. విషయం తెలిసిన సర్పంచ్ చల్లగుళ్ల వెంకటేశ్వరరావు వెళ్లి నిలదీయగా బిల్లులు రాకపోవడంతో స్తంభాలు తొలగిస్తున్నట్టు కాంట్రాక్టర్ చెప్పాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాలు తొలగించడం దారుణమని లబ్ధిదా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రా లేకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్ స్తంభాల ను తొలగించాడని, తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.


