ప్రకృతి వ్యవసాయం మేలు
ఏలూరు(మెట్రో): భవిష్యత్ తరాలకు రసాయనరహిత ఆహారాన్ని అందించేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్‌గా మార్చాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా సేంద్రియ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 117 మంది టీ–ఐసీఆర్‌పీఎస్ ఎంపికయ్యారు. వారు ఏలూరు జిల్లా నేచురల్ ఫార్మింగ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాపై సమీక్ష : జిల్లాలో కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కి తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డేటా గవర్నెన్స్‌పై..
రాష్ట్ర పాలనలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ కీలకంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు.
కార్పెట్ రంగానికి పూర్వ వైభవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏలూరు జిల్లా తివాచీ రంగానికి గుర్తింపు ఇచ్చారని, కార్పెట్ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు. స్థానిక పెన్షన్ లైను లక్ష్మీవారపుపేటలో గురువారం ఏలూరు పైల్ కార్పెట్ వీవర్స్ కో–ఆపరేటివ్ సేల్స్ అండ్ పర్చేజీ సెంటర్, ఏలూరు అసోసియేషన్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించి, పైల్ కార్పెట్ సొసైటీలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లూమ్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహసీల్దార్ కె.గా యత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి


