కూటమి పాలనలో వైద్యానికి తూట్లు
కైకలూరు: పేదల వైద్యం కూటమి పాలనలో మిథ్య గా మారుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ కై కలూరు సంత మార్కెట్ వైఎస్ విగ్రహం వద్ద మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, సమయం అంజి ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో మొత్తం 17 కాలేజీలకు గాను 7 మెడికల్ కాలేజీలు పూర్త య్యాయన్నారు. ఈ ఏడాది మరో 4, వచ్చే ఏడాది మరో 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభ కాలేదని చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాలేజీలకు పీజీ సీట్లు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. కూటమి నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు దూరమవుతున్నాయ న్నారు. కై కలూరులో అన్ని వర్గాల ప్రజలు సంతకాల సేకరణలో ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బలే నాగరాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగా కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు ఎనుగుల వేణుగోపాలరావు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ జయమంగళ కాసులు, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


