పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఉంగుటూరు: పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయనున్నారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. గురువారం మండలంలోని గొల్లగూడెంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మరడా మంగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు అప్పగించేందుకు జపం చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు ప్రైవేటుపరం అయితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మా రుతుందన్నారు. కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేదలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు వైద్య విద్య ఎలా అందుతుందన్నారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ బాలకృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మంద జయలక్ష్మి, బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి యెలిశెట్టి పాపారావుబాబ్జి, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు


