స్విమ్మింగ్‌లో పతకాలు
ఏలూరు రూరల్: ఏలూరు భిశ్వనాధ్‌భర్తియా స్విమ్మింగ్ పూల్‌లో శిక్షణ పొందిన క్రీడాకారులు ఎస్‌జీఎఫ్ పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల నరసరావుపేటలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ధనుష్‌సాయి 50, 100 మీటర్ల బట్టర్‌ఫ్లై విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. మరో క్రీడాకారిణి పూర్వి 50 మీటర్ల బట్టర్‌ఫ్లై 200 మీటర్ల ఐవీ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో బ్రాంజ్‌మెడల్ సొంతం చేసుకోగా, మోక్షప్రియ 50, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్, 200 మీటర్ల ఐఎం విభాగంలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. విజేతలను డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ అభినందించారు.
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 5 వరకూ కాకినాడలో డాక్టర్ వైఎస్‌ఆర్ స్కేటింగ్ ఆవరణలో 37వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. ఈ పోటీల్లో 6 ఏళ్ల విభాగంలో పాల్గొన్న ఏలూరు చిన్నారులు ఎం శ్రీషిత బ్రాంజ్ మెడల్ గెలుపొందగా, 14 ఏళ్ల వయస్సు విభాగంలో ఎన్ భువన్‌రత్న సైతం మరో బ్రాంజ్‌మెడల్ సొంతం చేసుకున్నాడన్నారు. కోచ్ ఖాసిమ్, క్రీడాకారులను అభినందించారు.
స్విమ్మింగ్‌లో పతకాలు


