నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు టౌన్: శాంతి భద్రల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్‌పీ)గా సుస్మిత బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల పలువురికి పోస్టింగులు ఇచ్చిన నేపథ్యంలో 2023 బ్యాచ్‌కు చెందిన సుస్మితను ఏఎస్పీగా నియమించారు. సుస్మిత బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజలకు సేవలు అందించాలన్నారు.


