పేకాట క్లబ్‌పై చర్యలు తీసుకోవాలి
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు రిక్రియేషన్ క్లబ్‌లో ఏర్పాటు చేస్తున్న పేకాట క్లబ్‌ను వెంటనే ఆపివేయాలని జూద నిర్వాహకుల వ్యతిరేక కమిటీకి చెందిన యువకులు డిమాండ్ చేశారు. మండలంలోని పోతవరప్పాడులోని మ్యాంగో రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌లో గతంలో మూసివేసిన పేకాట క్లబ్‌ను తిరిగి ఏర్పాటు చేస్తుండడంతో యువకులు సోమవారం నుంచి చేస్తున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగించారు. నిర్వాహకులు పేకాట క్లబ్‌కు చేస్తున్న ఏర్పాటును ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని.. లేకపోతే ఎన్ని రోజులైనా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ క్లబ్‌లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పారు.
ఏలూరు రూరల్: తుపాను కారణంగా వాయిదా వేసిన జిల్లా సివిల్ సర్వీస్ ఉద్యోగుల మహిళ, పురుషుల క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో చేపట్టనున్నామని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపిక పక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, ఖో ఖో, బెస్ట్ ఫిజిక్, హాకీ, కబడ్డీ, టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా, రెజ్లింగ్, స్విమ్మింగ్, మ్యూజిక్, డ్యాన్స్, షార్ట్ ప్లే క్రీడాంశాల్లో ఎంపిక జరుగుతుంది. జిల్లా జట్లుకు ఎంపికై న వారు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు సంబంధిత శాఖ ఉద్యోగుల గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9948779015 నెంబరులో సంప్రదించాలన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు వసూల్ రాజాలుగా అవతారం ఎత్తారు. ఏళ్ల తరబడి పాతుకుపోతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా.. జిల్లాలోని సిబ్బంది నుంచి ఇష్టారాజ్యంగా సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. షాడో డీఎంహెచ్‌ఓగా వ్యవహరిస్తోన్న ఉద్యోగి డబ్బుల దందాకు దిగినట్లు సిబ్బంది గుసగుసలాడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎంపీహెచ్‌ఎం, ఎంపీహెచ్‌ఏ సిబ్బంది సీటు చూసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో సమారుగా 245 వరకూ నర్సింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. పోలీస్ అటెస్టేషన్‌కు సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి నుంచీ రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలో పనిచేసే ఒకరికి బాధ్యత అప్పగించి ఫోన్‌పేకు డబ్బులు పంపేలా ఒత్తిడి చేస్తున్నారనే అపవాదు ఉంది. సుమారుగా రూ.4.50 లక్షలకు పైగానే వసూలు చేసి ఉంటారని సిబ్బంది చెప్పుకుంటున్నారు.
భీమవరం: సర్వ శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఎన్నికల్లో కూటమి నేతలిచ్చిన హామీలు అమలు చేయాలని ఈనెల 10న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ కోరింది. భీమవరం యుటీఎఫ్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు బావాజీ అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్ మాట్లాడుతూ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా నాయకులు మేరీ, సంతోషి, రమేష్, శ్రీనివాసరాజు, సువర్ణ రాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పేకాట క్లబ్‌పై చర్యలు తీసుకోవాలి


