మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
మండవల్లి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని పెరికేగూడెంలో కోటి సంతకాల సేకరణ ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, మండల శాఖ అధ్యక్షుడు బేతపూడి ఏసోబురాజు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. డీఎన్నార్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను సాధించారన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడంతో పాటు పేదలకు ఉచితంగా వైద్యసేవలు దక్కేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని, అందులో భాగంగానే ప్రజామద్దతు కూడగట్టేందుకు కోటిసంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములై ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ నాగదాసి థామస్, రైతు విభాగ ఉపాధ్యక్షుడు గుడివాడ వీరరాఘవయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, సర్పంచ్ పెరుమాళ్ళ పద్మ, నాయకులు పెనుమాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, సోబుల రెడ్డి, శివారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


