చెడు వ్యసనాలు, విలాసాలతో నేరాలు
చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్, మోటార్‌సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. 8లో u
తల్లిదండ్రుల ఆగ్రహం
కాళ్ల: బాధ్యతగా చూసుకోవాల్సిన వారు నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. మండల కేంద్రమైన కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 450 మంది విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో బుధవారం విద్యార్థులకు పెట్టేందుకు ఉపాధ్యాయులు అందించిన గుడ్లలో కొన్ని కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని నిర్వాహకులు ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోపోవడంతో అవే గుడ్లను ఉడకబెట్టారు. కుళ్ళిన గుడ్లు రంగు మారి దుర్వాసన రావడంతో విజిటింగ్‌కి వచ్చిన విద్యాశాఖ సిబ్బంది వెంటనే గమనించి గుడ్లను తీసి పారవేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వారాలు క్రితం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ విషయాన్ని గ్రామపెద్దలు దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా తూతూమంత్రంగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుళ్ళిన గుడ్లు తిని పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉపాధ్యాయులు నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


