సొంత ఆదాయ వనరులు పెంచాలి
ఏలూరు(మెట్రో): పంచాయతీలలో సొంత ఆదాయ వనరులను పెంపొందించేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనిచేయాలని జెడ్పీ సీఈవో ఎం.శ్రీహరి ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పంచాయితీ వనరుల కేంద్రంలో పంచాయతీలలో సొంత ఆదాయ వనరులు పెంపుదలపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. కేవలం ఇంటిపన్నులు ఒక్కటే కాదని ఇతర ఆధాయ వనరులను సృష్టించే అధికారాలు చట్టం ద్వారా పంచాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ట్రైనింగ్ మేనేజర్ జి.ప్రసంగి రాజు మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో పంచాయతీ సర్పంచ్‌లకు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరులు పెంపుదలపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిసోర్సు పర్సన్‌లుగా ఉంగుటూరు ఎంపీడీఓ జి.ఆర్.మనోజ్, గణపవరం డిప్యూటీ ఎంపీడీవో పీవీ సత్యనారాయణ, చేబ్రోలు, సూరప్పగూడెం సెక్రటరీలు జీడీ శ్రీనివాస్‌రావు, ముత్తయ్య ఫ్యాకల్టీలుగా వ్యవహారించారు.


