అక్రమ అరెస్టులకు బెదరం
టి.నరసాపురం: అక్రమ అరెస్టులకు వైఎస్సార్‌సీపీ బెదిరేది లేదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. మండలంలోని మల్లుకుంటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం కోటి సంతకాల సేకరణ కా ర్యక్రమం నిర్వహించారు. పార్టీ నేత తుమ్లూరి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనను గాలికి వదిలివేసి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమన్నా రు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కూటమి పాలనలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పరాకాష్టకు చేరాయన్నారు. తు పాను బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రజలను దారి మళ్లించడానికి అక్రమ అరెస్టుల బా టపట్టారని విమర్శించారు. ఆలయాల్లో భక్తులకు భద్రత లేదని, కాశీబుగ్గ దుర్ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. పార్టీ మండల కన్వీనర్ శ్రీనురాజు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, పామాయిల్ రైతు ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ జిల్లా నేత తుమ్మూరి శ్రీనివాసరెడ్డి, నా యకులు దాకారపు సూరిబాబు, ఉమ్మడి తేజ, బోళ్ల రంగారావు, బొడ్డు శ్రీను, పల్లా రమేష్, కొనకళ్ల సరేశ్వరరావు, కాల్నీడి సుబ్బారావు, డేవిడ్, దోరేపల్లి నరసింహారావు పాల్గొన్నారు.


