ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మొత్తంగా 454 అర్జీలు స్వీకరించారు. జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, డీర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు 142 మంది నూతన ట్రైనీ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసినట్టు ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి (డీపీఎం) బి.వెంకటేష్ తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్యాల యం పరిధిలో ఐదు రోజులపాటు రిసోర్స్ ప ర్సన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తుకు మ రింత అవసరమని, రసాయనాలు లేకుండా ప్రకృతి ఆధారిత పద్ధతుల్లో పంటలు పండించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్య త, రైతుల శిక్షణ, జీవావరణ సంరక్షణ, ఆరో గ్యకర ఆహారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రభా కర్, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏ లూరులోని జెడ్పీ సమావేశపు హాలులో నిర్వహించనున్నామని జెడ్పీ సీఈఓ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. అలాగే అదేరోజు ఉదయం 10 గంటల నుంచి జెడ్పీ 1 నుంచి 7 వరకు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఏలూరు(మెట్రో): జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లాలోని జెడ్పీ రోడ్ల స్థితిగతులపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా వర్షాల ప్రభావంతో దెబ్బతి న్న రహదారులపై వివరాలు తెలుసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ మరమ్మతులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు, అంతర్గత రహదారులు, పంటల రవాణా మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పెదవేగి: రాజకీయ అండతో తమను వేధిస్తున్నారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత కుటుంబం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ వద్ద వాపోయింది. బా ధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగికి చెందిన తాతా నాగమణి, దివ్యాంగుడైన ఆమె భర్త మాణిక్యాలరావుపై అదే గ్రామానికి చెందిన రేలంగి వంశీ అనే వ్యక్తి హత్యాయత్నం చేశాడని 2022లో పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 3న కేసు రాజీకి మాణిక్యాలరావు దంపతులు అంగీకరించారు. అయితే మరు సటి రోజు మాణిక్యాలరావు తన పొలంలో పనిచేసుకుంటుండగా వంశీ వెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై మాణిక్యాలరావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై స్పందించకపోగా తమపైనే కేసు పెట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నా రు. సెప్టెంబర్ 15న జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా ఎస్సై తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లతో 41 నోటీసులు తీసుకోమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఎస్పీకి మరోమారు ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
454 అర్జీల స్వీకరణ
454 అర్జీల స్వీకరణ


