అన్నదాత కుదేలు
నష్టం అంచనాలు ఇలా..
అన్నదాతను మోంథా తుపాను కుదిపేసింది. వారం రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో తుపాను ధాటికి వరి కంకులు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో వరితో పాటు మినుము, ఇతర వాణిజ్య పంటలు, పూల సాగు ఇలా అన్నీ భారీ నష్టాన్ని చవిచూశాయి. జిల్లాలో తుపాను నష్టం అంచనా రూ.100 కోట్లపై మాటే. మళ్లీ కోతలకు పెట్టుబడులు రెట్టింపు కావడం, తాలు గింజలతో పాటు దిగుబడి గణనీయంగా పడిపోవడం ఇలా ఎటు వైపు చూసినా పూర్తి నష్టాన్ని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో సుమారు 26 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉంగుటూరు, దెందులూరు, కై కలూరు, ఏలూరు నియోకవర్గాల్లో వరికి అపారనష్టం వాటిల్లగా చింతలపూడి, పోలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో మినుము, పత్తి ఇతర వాణిజ్య పంటలతో పాటు పూల తోటలకు నష్టం వాటిల్లింది. ఖరీఫ్ వరి సీజన్ మరో వారంలో ముగింపు దశకు చేరి జిల్లావ్యాప్తంగా కోతలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గోనె సంచులు మొదలు కొనుగోళ్ల వరకూ అన్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిన తుపాను పిడుగుపడటంతో కనీసం పెట్టుబడులు కూడా దక్కక పూర్తిగా విలవిలాడుతున్నారు.
ఎకరాకు రూ.20 వేలు అదనపు భారం
సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. అయితే వరి పూర్తిగా నేలకొరగడంతో ఎకరాకు 15 బస్తాల తాలు గింజలు రావడం, దీంతో పాటు సాధారణంగా గంటన్నరలో ఎకరా పంట కోత పూర్తయ్యే పరిస్థితి. అయితే పొలాల్లో నీరు నిలవడం, పంట నేలకొరగడంతో 4 నుంచి 5 గంటల కోత సమయం పట్టనుంది. దీంతో పెట్టుబడులు పెరగడం, కోత, కూలీ ఖర్చులు పెరగడం, నాణ్యత తగ్గిపోయి గింజ నల్లబడటంతో కనీస ధరలు కూడా దక్కని పరిస్థితి. మొత్తంగా ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ అదనపు భారం పడనుందని అంచనా.
‘కౌలు’కునేదెలా..? జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బీమా, సబ్సిడీ, ఎటువంటి పథకాలు వర్తించడం లేదు. దీంతో కౌలురైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకు ఉచిత పంటల బీమాను వర్తింపజేశారు. అయి తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీ మాకు స్వస్తి పలికింది. దీంతో జిల్లావ్యాప్తంగా 10 శాతం రైతులు కూడా బీమా చేయించని పరిస్థితి. ప్ర భుత్వం ఆదుకుంటామని, ఎన్యూమరేషన్ ఇస్తామ ని ప్రకటించిందిగానీ ఆంక్షలు విధిస్తే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ–క్రాప్‌తో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను నమోదు చేయడంతో పాటు కౌలు రైతుల పేర్లను కూడా నమోదుచేసి ఆహార పంటలకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ఇస్తేనేగానీ అన్నదాత కోలుకోలేని పరిస్థితి.
తుపానుతో పంగిడిగూడెంలో సుమారు వెయ్యి ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వంలో పంటల బీమాకు ఇబ్బంది పడ్డాం. బీమా ఉంటే ఇప్పుడు పరిహారం వచ్చేది. అయితే ఆ పరిస్థితి లేదు. బాధిత రైతులందరికీ నష్టపరిహారం తక్షణం అందించాలి. నేలవాలిన వరి పంట కోత కోస్తే ఎకరానికి 5 నుంచి 10 బస్తాలు మాత్రమే వస్తుంది. యంత్రంతో కోతకు గంటకు రూ.6 వేల వరకూ ఖర్చవుతుంది. అధికారులు నిష్పక్షపాతంగా పంట నష్టం సర్వే చేయాలి.
– కోట వెంకటేశ్వరరావు, వరి రైతు,
పంగిడిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం
బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం సమీపంలో నే ను నాలుగు ఎకరాల్లో 1001 రకం వరి పంట వేశాను. సుమా రు రూ.2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో పంట కోసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే తుపాను ప్రభావంతో పండిన పంటలో మూడున్నర ఎకరాలు నీట మునిగింది. వరి కంకులు నీటిలో తడిసిపోయాయి. దీంతో నాకు రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి.
– కోర్సా లక్ష్మి, గిరిజన రైతు,
ఎన్‌ఆర్‌పాలెం, బుట్టాయగూడెం మండలం
పెదపాడు మండలంలో నేలకొరిగిన వరిచేను
కొవ్వలి హైవే సమీపంలో నేలకొరిగిన పంట
నిండా ముంచిన ‘మోంథా’
వరిసాగు అతలాకుతలం
జిల్లాలో 26 వేల ఎకరాలకు పైగా పంట నష్టం
మినుము రైతులకూ అపార నష్టం
వాణిజ్య పంటలదీ అదే పరిస్థితి
రైతులపై అదనపు పెట్టుబడుల భారం
జిల్లాలో అన్నదాతలకురూ.100 కోట్లకు పైగా నష్టం
నియోజకవర్గాల వారీగా కై కలూరులో 3,330 ఎకరాలు, పోలవరంలో 4,485, ఉంగుటూరులో 5,540, దెందులూరులో 1,050, ఏలూరు రూరల్‌లో 1,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇక నూజివీడులో 1,900 ఎకరాల్లో, చింతలపూడిలో 813 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 20 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము, 2,400 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో మొక్కజొన్న, 167 ఎకరాల్లో వేరుశెనగ, 80 ఎకరాల్లో పూలతోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా.


