కడలి అల్లకల్లోలం
నరసాపురం: నరసాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. తీరం పొడవునా సముద్రం 50 మీటర్లు మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి తీరం వెంట సముద్ర అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాలల్లో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక, మొగల్తూరు మండలంలో పేరుపాలెం బీచ్‌ల్లో ఒక్కసారిగా పరిస్థితి మారింది. పేరుపాలెం బీచ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం సమీపం వరకూ కెరటాలు చొచ్చుకు వస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం: మోంథా తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున కేకేఎం ఎర్రకాలువ జలాశయాన్ని ఇరిగేషన్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఒక్కసారిగా వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ముందస్తుగానే జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 900 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు డీఈ సునీత, ఏఈ రాహుల్ భాస్కర్‌లు తెలిపారు. జలాశయం సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.30 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలోని పంగిడిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ ప్రవాహాన్ని సోమవారం ఆర్డీవో ఎంవీ రమణ పరిశీలించారు. జలాశయం నుంచి ముందస్తుగా నీరు వదులుతున్న నేపథ్యంలో ఎర్రకాలువ కాజ్‌వే పై నుంచి రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు. చినమైనవానిలంకలో పాత తుపాను షెల్టర్ బిల్డింగ్ సమీపం వరకూ సముద్రం చొచ్చుకు వచ్చింది. పెదలంక, తూర్పుతాళ్లు, మోళ్లపర్రు ప్రాంతాల్లో సముద్రగట్టు కోతకు గురైంది. మంగళవారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలపై తుపాన్ ప్రభావం ఉండొచ్చని అధికారులు గుర్తించారు.
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర ఆల్ టైం రికార్డు ధర పలికింది. కేజీ రూ.454 పలికి వేలం ప్రక్రియలోనే చరిత్ర సృష్టించింది. సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని ఐదు వర్జీనియా వేలం కేంద్రాల్లో వేలం ఉత్సాహంగా సాగింది. గోపాలపురం వర్జీనియా వేలం కేంద్రంలో ధర రూ.454 పలికి కొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల అత్యధికంగా రూ.430 లభించింది. ఆ తరువాత పడిపోయి రూ.420, రూ.415 వరకు దిగజారింది. వేలం చివరి దశకు వచ్చే సరికి మళ్లీ రికార్డు ధర నమోదైంది. గత ఏడాది అత్యధికంగా రూ.411 ధర పలకగా, ఆ ఏడాది ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో సరాసరి ధర రూ.300 వచ్చింది. దీంతో రైతులు ఉత్సాహంగా వర్జీనియా సాగు చేశారు. ఈ ఏడాది మొదట్లో చాలా నిరాశగా ప్రారంభమైంది. కేజీ ధర రూ.290 పలకడంతో ఒక దశలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత క్రమంగా ఈ ధర రూ.390 వరకు పెరిగి తరువాత తగ్గుతూ రూ.350కు చేరుకుంది. ఈ ధర వద్దే ఎక్కువ కాలం వేలం ప్రక్రియ కొనసాగింది. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ పెరుగుతూ ధర రూ.430కు చేరుకుంది.
ఏలూరు రూరల్: తుపాను కారణంగా ఈ నెల 29న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో తలపెట్టిన సివిల్ సర్వీస్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు వాయిదా వేసామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
కడలి అల్లకల్లోలం
కడలి అల్లకల్లోలం


