శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట
ఏలూరు రూరల్: ఏలూరులోని ఖేలో ఇండియా సెంటర్ (శాయ్) వెయిట్ లిఫ్టర్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారని సెంటర్ ఇన్‌చార్జి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26 వరకూ తెనాలిలో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న లిఫ్టర్లు మొత్తంగా 3 గోల్డ్‌మెడల్స్, 3 సిల్వర్‌మెడల్స్, 3 బ్రాంజ్‌మెడల్స్ సాధించారని వివరించారు. సీహెచ్ కీర్తన ఉత్తమ వెయిట్‌లిఫ్టర్‌గా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. అండర్ 17 విభాగంలో పోటీపడిన ఎం పావని, సీహెచ్ కీర్తన రెండు గోల్డ్ మెడల్స్, జి.పవిత్ర, ఎన్ విహారిక రెండు సిల్వర్ మెడల్స్, ఎం దీక్షిత్, కె ఆశాజ్యోతి రెండు బ్రాంజ్‌మెడల్స్ చేజిక్కించుకున్నారని వివరించారు. అండర్ 19 విభాగంలో యు శశికళ గోల్డ్ మెడల్, పి దీపిక, కె శ్రీవెన్నల, సీహెచ్ హారికరెడ్డి మూడు సిల్వర్‌మెడల్స్, జడ్ పావని బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వెల్లడించారు. బాలికలు అందరూ స్థానిక ఏఆర్‌డీజీకె పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/పెదపాడు: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. మూడవ రోజు సోమవారం తెల్లవారుజామున పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. టాక్స్ లేకుండా నడుపుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. ఈ మేరకు వివరాలను ఏలూరు ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ వెల్లడించారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 200 మంది పోటీల్లో పాల్గొనగా, 15 మంది క్రీడాకారులు ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్‌కి అర్హత సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడలో జరుగుతుందని చెప్పారు. విజేతల్లో మొదటి ఐదు స్థానాల్లో వరుసగా శ్రీ సాయి నంద గోపాల్, నవదీప్ కావూరి, కె.ఓంకార్, కుషాల్ కార్తికేయ నాయుడు, సూర్య జితేష్ నిలిచారు. బెస్ట్ ఓపెన్ మహిళగా శ్యామలను చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. పోటీలకు అవకాశం కల్పించిన జిల్లా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి టోర్నమెంట్ డైరెక్టర్ సూర్య నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ హంస చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ స్కూల్లో ఈ పోటీలు నిర్వహించారు.
భీమవరం : భీమవరం రెండో పట్టణంలో జరిగిన దొంగతనంలో 113 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.46 క్యారెట్ల వజ్రాలు అపహరణకు గురయ్యాయి. వివరాల ప్రకారం సూర్యనారాయణపురంలో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరావు ఇంటికి హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుమార్తె సూర్యదీప్తి ఈ నెల 25న వచ్చారు. తణుకులో జరిగిన ఓ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 26న వెళ్లారు. అక్కడ్నుంచి అదేరోజు రాత్రి భీమవరం చేరుకున్నారు. తన హ్యాండ్ బ్యాగులో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఉంచి గదిలోని కప్‌బోర్డులో పెట్టారు. తెల్లారిన తర్వాత చూసేసరికి బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట
శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట


