నాగేంద్రహారాయ.. నమఃశివాయ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పేరంపేట రోడ్డులో ఉన్న బాట గంగానమ్మ గుడి సమీపంలోని వేప చెట్టు వద్ద ఉన్న పుట్టల వద్ద కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో పుట్ట వద్ద నాగు పాము ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్తీక సోమవారం రోజున నాగుపాము రూపంలో శివుడు కరుణించాడంటూ భక్తులు నాగుపాముకు పూజలు నిర్వహించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంపై సోమవారం మోంథా తుపాను ఎఫెక్ట్ పడింది. కార్తీక మాస పర్వదినాల్లో క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. అయితే మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల్లో అధిక శాతం తమ యాత్రను వాయిదా వేసుకున్నారు. దాంతో స్వల్ప సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తుల లేమితో నిర్మానుష్యంగా మారింది. దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు.
నాగేంద్రహారాయ.. నమఃశివాయ


