ఎడతెగని వాన
ఏలూరు(మెట్రో): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. గురువారం ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లాయి. మెట్టప్రాంతంలో భారీస్థాయిలో వర్షం నమోదైంది. ఏలూరులో ఎడతెగని వానతో జనజీవనం స్తంభించింది. మరికొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కలిదిండి మండలంలో 78.2 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది.
మండలాల వారీగా వర్షపాతం
మండవల్లిలో 51.2 మి.మీ., ముదినేపల్లిలో 46.6, కై కలూరులో 39.6, పెదపాడులో 17.4, ద్వారకాతిరు మలలో 17, లింగపాలెంలో 16.8, పెదవేగిలో 16.4, ఆగిరిపల్లిలో 13.6, ముసునూరులో 12.6, నూజివీడులో 10.2, కొయ్యలగూడెంలో 7.4, చాట్రాయిలో 6.8 మి.మీ వర్షపాతం నమోదైంది. నిడమర్రులో 6 మి.మీ, భీమడోలు, ఉంగుటూరులో 5.2 మి.మీ చొప్పున, టి.నరసాపురంలో 5, దెందులూరు, జంగారెడ్డిగూడెంలో 4.2 మి.మీ. చొప్పున, పోలవరంలో 3.8 మి.మీ., ఏలూరులో 3.2 , ఏలూరు రూరల్‌లో 2.8, కామవరపుకోటలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 13.5 మి.మీ వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 మి.మీ సగటు వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిస్తే అవకాశం ఉంది.
విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసినట్టు ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆఫీస్‌లో 9491030712 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912, ఏలూరు సర్కిల్ ఆఫీస్ కంట్రోల్‌రూమ్ 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆఫీస్ 9491030712 నంబర్లలోనూ సంప్రదించవచ్చన్నారు.


