కూటమి పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం
ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: కూటమి పాలనలో వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందని ద్రాక్షాలా మారాయని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాన్ని కలిదిండి మండలం పెదలంకలో గురువారం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మొత్తం 17 కాలేజీల స్థాపన జరిగిందన్నారు. వీటిలో 7 కాలేజీలు పూర్తి, ఈ ఏడాది మరో 4 కా లేజీలు ప్రారంభం, వచ్చే ఏడాది 6 కాలేజీల పను లు పూర్తి చేసేలా వైఎస్ జగన్ ప్రణాళిక రూపొందించారన్నారు. కాలేజీల్లో పేద విద్యార్థులకు 75 శాతం ఉచిత మెడికల్ సీట్లు, మరో 25 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద నిర్ణయించారన్నారు. కూటమి ప్రభు త్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. తిరిగి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేటు టెండర్లను రద్దు చేస్తామన్నా రు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల నిర్వాహణకు రూ.4,500 కోట్లు ప్రభుత్వం వెచ్చించలేకపోవడం ఏమిటనీ ప్రశ్నించారు. పేద లకు జరిగే అన్యాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్‌కు తెలియజేయాలన్నారు. ముందుగా గ్రామంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి అయినాల బ్రహ్మాజీరావు, రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్‌బాబు, జిల్లా మేధావుల విభాగ అధ్యక్షుడు దుగ్గిరాల నాగు, కలిదిండి, కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు తిరుమని రమేష్, సింగంశెట్టి రాము, వివిధ హోదాల్లో నాయకులు దున్నా బేబీ, ముండ్రు చార్లెస్, పండు ఆనంద రవి రాజు, ముద్దం రంగబాబు, నామాన అన్నవరం, దుగ్గిరాల రమేష్, రావాడి నాగ బాల బాలాజీ గారు, ఇమ్మనేని రమాదేవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


