ఎంత వరకూ సమంజసం? | - | Sakshi
Sakshi News home page

ఎంత వరకూ సమంజసం?

Oct 22 2025 7:22 AM | Updated on Oct 22 2025 7:22 AM

ఎంత వ

ఎంత వరకూ సమంజసం?

ఎంత వరకూ సమంజసం? తుస్సుమన్న హామీ జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయాలి వచ్చే నెల నుంచి అమలు చేయాలి ●

నాలుగు డీఎలు ఉద్యోగులకు బకాయిలు పడిన ప్రభుత్వం ఒక డీఎ విడుదలకు హామీ ఇచ్చింది. ఆ డీఎను ఉద్యోగులు మరణిస్తే ఇస్తామనడం, లేదంటే ఉద్యోగ విరమణ చేసిన తరువాత చెల్లిస్తామనడం ఎంత వరకూ సమంజసం. ఈ జీఓలను మార్చి ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

– ఆర్‌ఎస్‌ హరనాథ్‌, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం ఇచ్చిన ఒక డీఎ ప్రకటన చూసి ఉద్యోగులు కాస్త ఆనందం వ్యక్తం చేశారు. దీపావళికి టపాసులు పేలాయి. ప్రభుత్వం ఇచ్చిన డీఎ హామీ మాత్రం తుస్సుమంది. తక్షణమే ఈ డీఎ నిధులు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయాలి. పెన్షనర్లకు తక్షణమే చెల్లించే ఏర్పాట్లు చేయాలి.

– కె.రమేష్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ప్రభుత్వం ప్రకటించిన డీఎ బకాయిలను తక్షణమే విడుదల చేసి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయాలి. ఇప్పటికే 4 బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి పక్కన పెట్టినా ఇచ్చిన హామీ ప్రకారం ఒక డీఎ బకాయినైనా ప్రభుత్వం చెల్లించే విధంగా జీఓలో మార్పులు చేయాల్సిందే.

– సిహెచ్‌ శ్రీనివాస్‌, జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు

ఇప్పటికే పెన్షనర్లు 70 సంవత్సరాల పైబడి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డీఆర్‌ బకాయిలు రానున్న నెల నుంచి అమలు చేయాలి. మరో రెండు సంవత్సరాల తరువాత చెల్లిస్తానమడం, అది కూడా 12 విడతల్లో చెల్లిస్తాననడం ఎంత వరకూ సమంజసం.

– కె.మహాలక్ష్ముడు, జిల్లా పెన్షనర్ల కార్యదర్శి

ఎంత వరకూ సమంజసం? 
1
1/3

ఎంత వరకూ సమంజసం?

ఎంత వరకూ సమంజసం? 
2
2/3

ఎంత వరకూ సమంజసం?

ఎంత వరకూ సమంజసం? 
3
3/3

ఎంత వరకూ సమంజసం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement