
స్తంభించిన జనజీవనం
● ఏలూరు జిల్లాలో కుండపోత వాన
● ఏలూరు పట్టణంలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
● ఏజెన్సీలో పొంగిన వాగులు, వంకలు
ఏలూరు(మెట్రో): జిల్లా వ్యాప్తంగా సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఉదయమే ప్రారంభమైన వర్షం ఉరుములు, పిడుగులతో జిల్లాను తడిసి ముద్దచేసింది. జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షపాతం నమోదవుతున్నప్పటికీ సోమవారం వేకువ జాము నుంచే ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఏలూరు ప్రాంతంలో వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజలు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 8.30 గంటల వరకు 388.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అధికంగా కైకలూరులో 87.4 మి.మీ, బుట్టాయగూడెంలో 40.8, కొయ్యలగూడెంలో 38.2, ద్వారకాతిరుమలలో 35, జంగారెడ్డిగూడెంలో 34.6, కలిదిండిలో 26.6, ముదినేపల్లిలో 25.4, ఏలూరు నగరంలో 21.6, మండవల్లిలో 20.6, కుక్కునూరులో 11.2, ఏలూరు రూరల్ మండలంలోని 9.6, ఉంగుటూరు 9.4, పోలవరంలో 8, పెడపాడులో 6.8, వేలేరుపాడులో 6.4, జీలుగుమిల్లిలో 2.4, భీమడోలులో 1.8, నూజివీడులో 1.2, నిడమర్రులో 1.2, లింగపాలెంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం సైతం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది.
బుట్టాయగూడెం మండలంలోని ఐటీడీఏకు వెళ్ళే మార్గంలో వాగు ప్రవాహం
చెరువును తలపిస్తున్న ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం

స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం