
వాసవీ మాతకు సారె సమర్పణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ఏలూరు రోడ్డులో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ పంచాయతన క్షేత్రంలోని వాసవీ అమ్మవారికి శనివారం 250 కేజీల ఆషాఢం సారె అందజేశారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పూలతో పాటు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా విశేష పూజలు జరిగాయి. 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు మారం వెంకటేశ్వరరావు, కొర్లేపర రాము, నున్నా సుందరరావు, బోగవిల్లి రమేష్, ఆలపాటి చిన్న, సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనితా క్లబ్, వాసవీ క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.