
తప్పిన ముప్పు
దెందులూరు: జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీతంపేట పాల డెయిరీ వద్ద అత్యంత వేగంతో లారీని వెనుక నుంచి వైజాగ్ నుంచి చైన్నె వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, హైవే సేఫ్టీ పోలీస్ సిబ్బంది బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించారు.
54 మంది ప్రయాణికులు సురక్షితం
ముగ్గురికి స్వల్ప గాయాలు