
బాబు ష్యూరిటీ.. దగా గ్యారెంటీ
గణపవరం: చంద్రబాబు మోసపూరిత ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల ముందుంచాలని, అధికార దాహంతో వారిచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రజలను ఏరకంగా ఏమార్చారో ప్రజలకు వివరించాలన్నారు. తాము మోసపోయినట్టు ప్రజలు గ్రహించారని, ఏడాది కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. తొలి ఏడాదంతా ఖజానా ఖాళీ అంటూ హామీలను పక్కపెట్టేశారని విమర్శించారు. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలుచేసినా కనీసం 50 శాతం మందికి కూడా అందలేదని మండిపడ్డారు.
జగన్‌పై కుట్రలు : కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం పూర్తిగా కోల్పోయిందని అందుకే మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది తరలివస్తున్నారని వాసుబాబు అన్నారు. ప్రజాబలాన్ని ఎదుర్కోలేని ప్రభుత్వం తప్పుడు కేసులు, అడ్డమైన నిబంధనలతో జగన్‌ను ప్రజల్లోకి రాకుండా చేసే కుట్రలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు కేవలం మీడియా మేనేజ్‌మెంట్, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారంతో కాలం గడుపుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఉందన్నారు. 2014 ఎన్నికల్లో 650 హామీలిచ్చి కనీసం 65 హామీలు కూడా నెరవేర్చలేదని, మళ్లీ 2024లో 140 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అయినా రూ.1.70 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, ఈ నిధులను ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు.
మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, సూపర్‌సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకూ సూపర్ వన్ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారన్నారు. ఈ సందర్భంగా రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దండు రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశీ, కె.జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్యశ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నడింపల్లి సోమరాజు,
రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కన్వీనర్ ముళ్లగిరి జాన్సన్, రాష్ట్ర యూత్ కార్యదర్శి మద్దుల రాజా, పార్టీ జిల్లా కన్వీనర్లు కందులపాటి శ్రీను, పొత్తూరి శ్రీనివాసరాజు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి వెజ్జు వెంకటేశ్వరావు, నాయకులు కమ్మిల భాస్కరరాజు, పుప్పాల గోపి, ఎలిశెట్టి బాబ్జి, తుమ్మగుంటా రంగా, రామకుర్తి నాగేశ్వరరావు, రొంగల శ్రీను, రామిశెట్టి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సమయం వీరరాఘవులు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మందా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కూటమి వంచనపై నిలదీద్దాం
ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు

బాబు ష్యూరిటీ.. దగా గ్యారెంటీ