పెదపాడు: మండలంలోని సత్యవోలులో కామ్రేడ్ తెంటు సుధాకర్ సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. సీపీఐఎంల్ సానుభూతిపరులు, విరసం నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిగా, డాక్టర్‌గా, కామ్రేడ్‌గా సుధాకర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేద, బడుగు, పీడిత ప్రజల కోసమే సుధాకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కృష్ణ లావేటి శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టరు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష
ఉండి: హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో మండలంలోని కోలమూరు గ్రామంలో కొమ్మర కనకారావు మీద జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు సిర్ర కనకారావుపై నేరం రుజువు కావడంతో అతడికి భీమవరం అసిస్టెంట్ సెషన్స్‌కోర్టు జడ్జి ఎం సుధారాణి మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. కేసు విచారణకు సహకరించిన సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి అభినందించినట్లు ఎస్సై తెలిపారు.
కామ్రేడ్ సుధాకర్ సేవలు ఎనలేనివి


