ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా నియమితులైన ఆమె సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలను అత్యంత సౌకర్యవంతమైన డిపోలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులతో కలిసికట్టుగా బృందంగా పని చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. డిపో మేనేజర్ బి.వాణి, ఆర్టీసీ పీఆర్‌ఓ కేఎల్‌వీ నరసింహం పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 984 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 984 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉద యం 181 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 164 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 145 మందికి 136 మంది, మధ్యాహ్నం 141 మందికి 132 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 201 మందికి 190 మంది, మధ్యాహ్నం 200 మందికి 183 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
20, 21వ తేదీల్లో పరీక్షల మార్పు
ఈనెల 20, 21వ తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు చేశారని, 20న జరగాల్సిన పరీక్షను జూలై 1న, 21న జరగాల్సిన పరీక్షను జూలై 2 న నిర్వహించనున్నారని డీఈఓ తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు ఈనెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
భీమవరం: జిల్లాలో సోమవారం ఐదు కేంద్రా ల్లో నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు 93 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 605 మందికి 561 మంది, మధ్యాహ్నం 597 మందికి 559 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
రూ.260 కోట్లకు టెకు బ్యాంక్ వ్యాపారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని ది ఏలూ రు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టెకు బ్యాంక్) వ్యాపారం రూ.260 కోట్లకు చేరుకుందని బ్యాంక్ సీఈఓ ఎం.అచ్యుతరావు తెలిపారు. ఆదివారం జరిగిన టెకు బ్యాంకు మహాజన సభ వివరాలను ఆయన సోమవారం పత్రికలకు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.129.36 కోట్ల నుంచి రూ.146.65 కోట్లకు డిపాజిట్లు పెరిగి 13.37 శాతం వృద్ధి సాధించామన్నారు. రూ.91.47 కోట్ల నుంచి రూ.113.67 కోట్లకు బ్యాంకు రు ణాలు పెరిగి 24.28 శాతం వృద్ధి సాధించామ న్నారు. అలాగే షేరు ధనం రూ.5.35 కోట్ల నుంచి రూ.5.83 కోట్లు పెరిగి 9.10 శాతం వృద్ధి సాధించామన్నారు. బ్యాంక్ సభ్యులకు షేరు ధనంపై 10 శాతం డివిడెండ్‌గా రూ.5,52,96,423 ప్రకటించామన్నారు. 2025–26లో బ్యాంక్ లెక్కల ఆడిట్‌కు విజయవాకు చెందిన బీడీపీఎస్ అండ్ కంపెనీ చార్టర్డ్ అక్కౌంటెంట్స్‌ను ఆడిటర్‌గా నియమించడా నికి సమావేశం ఆమోదించిందన్నారు. బీవీ సుబ్రహ్మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాజన సభలో డైరెక్టర్లు, బ్యాంక్ సీఈఓ ఎం.అచ్యుతరావు పాల్గొన్నారు.
వృద్ధుల ఆస్తులకు రక్షణ కల్పించాలి
భీమవరం: తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని, ట్రిబ్యునల్ తీర్పును కచ్చితంగా అమలు జరిగేలా చూ డాలని జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డాల సత్యనారాయణ, కొటికలపూడి చిట్టి వెంకయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ, అవగాహన దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేయాలని, వృద్ధుల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, మండలానికి ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కోరారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం


