
శ్రీవారి క్షేత్రం.. శోభాయమానం
చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఈనెల 14తో ముగియనున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం, జంటగోపురాల ప్రాంతం విద్యుద్దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతున్నాయి. అలాగే ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్, కొండపైన స్వాగత ద్వారం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. – ద్వారకాతిరుమల