
ప్రశాంతంగా నీట్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి పంపించారు. మొత్తం 1,200 మంది విద్యార్థులకు 1,162 మంది హాజరయ్యారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 232 మంది, కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 360 మందికి 347 మంది, ఆర్‌ఆర్‌పేట సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రంలో 240 మందికి 234 మంది, గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయ కేంద్రంలో 240 మందికి 235 మంది, గోపన్నపాలెం ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో 120 మందికి 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా, బయాలజీ సులువుగా, కెమిస్ట్రీ ప్రశ్నలు మోస్తరుగా ఉన్నట్టు విద్యార్థులు అన్నారు.

ప్రశాంతంగా నీట్ పరీక్షలు