ఉంగుటూరు: మెట్ట ప్రాంతంలో పామాయిల్ తోటలో అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఫలితాలు బాగండటంతో విస్తీర్ణం పెరుగుతోంది. రెండు సంవత్సరాల పంట కాలంలో దిగుబడి బాగుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 15 నుంచి 20 టన్నులు దిగుబడి లభిస్తోంది. మండలంలోని రావులపాలెం చుట్టు పక్కల గ్రామాల్లోని బొప్పాయి నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి పెంచుతున్నారు. పామాయిల్ మొక్క తోటలో బొప్పాయి పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు 900 మొక్కలు పడుతుండగా.. 8 అడుగులు వెడల్పులో బెడ్‌లు ఏర్పాటుచేసి మొక్కకి మొక్కకి మధ్య 6 అడుగులు వ్యత్యాసం ఉండేలా నాటాలి. పంట కాలంలో దోమ, నల్లి, తామర పురుగు ఆశిస్తే మందులు పిచికారి చేస్తే సరిపోతోంది. కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు సీజన్ ప్రకారం ధర పలుకుతోంది. ఎకరాకు ఖర్చు రూ.లక్ష వరకూ అవుతుందని.. అయితే రూ.లక్షకు పైనే లాభం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు హార్టీకల్చర్ శాఖ సబ్సిడీ అందిస్తుంది. మల్చింగ్ షీటు వేస్తే ఎకరాకు 6400 సబ్సిడీ ఇస్తున్నారు. ఎకరాకు మరో రూ.9,865 సబ్సిడీ ఇస్తున్నారు. ఉంగుటూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల, భీమడోలు, కామవరపుకోట తదితర మండలాల్లో పామాయిల్ తోటలో అంతరపంటగా బొప్పాయి వేస్తున్నారు.
ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి
పామాయిల్‌లో బొప్పాయి సాగు
పామాయిల్‌లో బొప్పాయి సాగు