జంగారెడ్డిగూడెం: చిన్నారులను హింసించిన ఘటనకు సంబంధించి స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఐసీడీఎస్ పీవో బ్యూలా, సూపర్‌వైజర్ లక్ష్మి పరామర్శించారు. శనివారం నుంచి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మారుటి తండ్రి పుచ్చకాయల దుర్గాప్రసాద్ చిన్నారులు సాత్విక్, కరుణసత్యలను కొట్టి హింసించిన ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. మరో రెండు రోజులు చిన్నారులను పర్యవేక్షణలో ఉంచనున్నట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. సాత్విక్‌కు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌జబీర్ తెలిపారు.