పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం
పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పడకేశాయి. బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. 8లో u
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 25,179 మంది విద్యార్థులు 133 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి తరగతి గదిలో గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, ప్రతి విద్యార్థి బెంచిపై కూర్చునే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా ఉండాలని, ఏదైనా జరిగితే సంబంధిత ఇన్విజిలేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్య శాఖాధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నెల 31 వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. జవాబు పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 9 వరకు కొనసాగిస్తారు. జిల్లా వ్యాప్తంగా 25179 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 23,051 మంది ఉండగా వారిలో 11,529 మంది బాలురు, 11522 మంది బాలికలు ఉన్నారు. ఒకసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు 2,128 మంది విద్యార్థులుండగా వీరిలో 1432 మంది బాలురు, 696 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా పత్రాలను పరీక్షా కేంద్రాలకు సమీపంలోని 31 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో 6 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటిలో ఉంగుటూరు మండలంలోని కై కరం జెడ్పీ పాఠశాల, లింగపాలెం మండలంలోని రంగాపురం జెడ్పీ పాఠశాల, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం జెడ్పీ పాఠశాల, కలిదిండి మండలం కోరుకొల్లు జెడ్పీ పాఠశాల, టీ.నరసాపురం జెడ్పీ పాఠశాల, జీలుగుమిల్లిలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ఉన్నాయి. ఈ ఆరు కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి వివిధ స్థాయిల్లో అధికారులను నియమించారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. మరో ఐదుగురు అదనపు డిపార్ట్‌మెంటల్ అధికారులు, 62 మంది కస్టోడియన్లను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించారు. 1,120 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
న్యూస్‌రీల్
పరీక్షల షెడ్యూల్
17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ –ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు)
19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
21న ఇంగ్లీష్
22న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2(కాంపోజిట్ కోర్సు)
24న గణితం
26న ఫిజికల్ సైన్స్
28న బయోలాజికల్ సైన్స్
29న ఓల్డ్ ఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ పరీక్షలు)
31న సాంఘిక శాస్త్రం
దూర విద్య పరీక్షలకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచే నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 వరకూ నిర్వహించనున్నారు. 793 మంది పరీక్షలు రాసేందుకు 17 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
రేపటి నుంచి 133 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
హాజరుకానున్న 25,179 మంది విద్యార్థులు
6 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా చూడాలని సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్లకు స్పష్టం చేశాం. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. పాఠశాల యూనిఫారం ధరించి పరీక్షకు హాజరుకాకూడదు.
– ఎం.వెంకట లక్ష్మమ్మ, ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి
పది పరీక్షలకు సిద్ధం
పది పరీక్షలకు సిద్ధం