ఉండి: పేదోడిపై ప్రతాపం, ధనవంతుడిపై ప్రేమ కురిపిస్తున్న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు పారిశ్రామికవేత్త రంగరాజు ఆక్రమణలపై అంత ప్రేమ ఎందుకు? అని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మండిపడ్డారు. శుక్రవారం ఎన్నార్పీ అగ్రహారంలో నిర్వహించిన సైకిల్‌యాత్రలో గ్రామ ప్రజలు రంగరాజు ప్రభుత్వ భూముల ఆక్రమణలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బురిడి వాసుదేవరావు మాట్లాడుతూ 1987లో జాతీయ రహదారిని ఆనుకుని బీసీ కాలనీ ఏర్పడిందన్నారు. జాతీయ రహదారికి వెళ్లేందుకు 60 అడుగుల రహదారి అవసరం కాగా రంగరాజు ఆక్రమణలతో కేవలం 8 అడుగుల రహదారి మాత్రమే ఇస్తానని చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు రంగరాజు జోలికి వెళ్లకుండా రహదారి కబ్జాను ప్రోత్సహిస్తున్నట్లున్నారని ఆరోపించారు.