ప్రజలందరికీ బలవర్ధక బియ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ బలవర్ధక బియ్యం

Oct 8 2023 1:40 AM | Updated on Oct 8 2023 1:40 AM

- - Sakshi

9న అప్రెంటీస్‌ మేళా
ఉండి: ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్‌ వి.శ్రీనివాసరాజు తెలిపారు.

ఆదివారం శ్రీ 8 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2023

ఏలూరు(మెట్రో): ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఓ వైపు మాతా శిశుమరణాల నియంత్రణ, మరోవైపు పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రజల ఆరోగ్య సమస్యలకు ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్ధక బియ్యం)తో చెక్‌ పెట్టాలని భావించింది.

ఈ మేరకు ప్రతినెలా ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాకు చర్యలు తీసుకుంది. అయితే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎంతో మేలు చేసే ఫోర్టిఫైడ్‌ బియ్యంపై అవగాహన లేకపోవడంతో ప్రజలు వినియోగించేందుకు ఆలోచిస్తున్నారు. బలవర్ధక బియ్యం పంపిణీ చేపట్టి నెలలు గడుస్తున్నా కొందరు ప్లాస్టిక్‌ రైస్‌గా.. మరికొందరు కల్తీలు జరుగుతున్నట్టు అపోహ పడుతున్నారు. దీంతో రేషన్‌ వాహనాల వద్ద బియ్యాన్ని తీసుకున్నా వాడకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం ప్రయోజనాలపై అధికారులు తరచూ అవగాహన కలిగిస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలకు ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6,30,223 మంది రేషన్‌ కార్డుదారులకు 8,783 టన్నులు, పశ్చిమగోదావరి జిల్లాలో 5,66,021 మంది కార్డుదారులకు 7,934 టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేస్తున్నారు.

ఒకటి లేదా రెండు కిలోలు కలుపుతూ..

ఫోర్టిఫైడ్‌ రైస్‌ను వాడుక భాషలో బలవర్ధక బియ్యంగా పిలుస్తారు. సాధారణ బియ్యానికి, ఫోర్టిఫైడ్‌ బియ్యానికి పలు అంశాల్లో తేడాలు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోల్చుకుంటే బలవర్ధక బియ్యంలో పోషకాలు మెండుగా ఉంటాయి. పోషకాలను బియ్యం రూపంలో మార్చి ప్రత్యేక గింజలుగా తయారు చేసి సాధారణ బియ్యంలో కలుపుతూ వీటిని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కృత్రిమ బియ్యాన్ని కెర్నెల్స్‌ అంటారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ప్రతి 100 కిలోల బియ్యానికి ఆరోగ్య అవసరాలను బట్టి ఒకటి కిలో లేదా రెండు కిలోల కెర్నెల్స్‌ కలుపుతారు.

న్యూస్‌రీల్‌

తయారు చేసే విధానం

సాధారణంగా శాసీ్త్రయ విధానంలో సిద్ధం చేసిన విటమిన్‌లు, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిండి చేసి బియ్యం పిండితో కలిపి ఎక్స్‌ట్రూడర్‌ యంత్రంలోకి ప్రవేశపెడతారు. కొంత సమయం తర్వాత ప్రత్యేక ప్రక్రియ ద్వారా పిండి మిశ్రమం గింజలుగా మారుతుంది. బియ్యం ఆకారంలో ఉండే వీటి పొడవు గరిష్టంగా 5.మి.మీ, వెడల్పు 2.2 మి.మీ ఉంటుంది. సాధారణ బియ్యానికి సరిసమానమైన కొలతలతో వీటిని సిద్ధం చేస్తారు. అనంతరం 100 కిలోల బియ్యానికి గరిష్టంగా 2 కిలోల చొప్పున వీటిని కలుపుతారు. అనంతరం బ్లెండర్‌ ద్వారా ఫోర్టిఫైడ్‌ రైస్‌గా మారుస్తారు. ఫోర్టిపైడ్‌ బియ్యం ప్యాక్‌పై ‘ఎఫ్‌’ అనే ప్రత్యేక గుర్తును ముద్రిస్తారు.

ఇలా వండుకుంటే ప్రయోజనం

బలవర్ధమైన బియ్యంలో జతచేసిన పోషకాలను కోల్పోకుండా ఉండాలంటే ప్రత్యేక విధానంలో వండుకుంటే పోషకాలు అందుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ బియ్యాన్ని కడిగేటప్పుడు అతిగా రుద్దకుండా వండే ముందు కొంతసేపు నీటిలో ఉంచి సున్నితంగా కడిగి పోషకాలు కోల్పోకుండా చూసుకోవాలని, అలాగే అన్నం వండేటప్పుడు నెయ్యి, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలికలు, లవంగాలు వంటి దినుసులు వేసుకుంటే మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌లో పోషకాలు మరింతగా పెంచుకోవాలంటే సగం నీరు, సగం పాలుతో ఉడికిస్తే పిల్లలకు మరిన్ని పోషకాలు అందుతాయని అంటున్నారు. ఈ బియ్యాన్ని మూతపెట్టి ఉడికించాలని, తెరిచిన పాత్రలో వండితే పోషకాలు ఆవిరి రూపంలో పోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ఫోర్టిఫైడ్‌ రైస్‌తో ఆరోగ్యం పదిలం

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

పోషకాహార లోపాల నివారణకు చర్యలు

ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11.96 లక్షల కార్డుదారులకు పంపిణీ

జిల్లా రేషన్‌ ఎండీయూ రేషన్‌ కార్డుదారులు బియ్యం సరఫరా

షాపులు వాహనాలు (నెలకు టన్నుల్లో..)

ఏలూరు 1,123 395 6,30,223 8,783

పశ్చిమగోదావరి 1,052 356 5,66,021 7,934

ఫోర్టిఫైడ్‌ బియ్యంలో పోషకాలు (కిలోకు..)

ఐరన్‌ 42.5 మి.గ్రా

పోలిక్‌ యాసిడ్‌ 125 మైక్రో గ్రాములు

విటమిన్‌ బి–12 1.25 మి.గ్రా

జింక్‌ 15 మి.గ్రా

విటమిన్‌–ఎ 700 మైక్రో గ్రాములు

విటమిన్‌ బి–1 1.5 మి.గ్రా

విటమిన్‌ బి–2 1.75 మి.గ్రా

విటమిన్‌ బి–3 20 మి.గ్రా

విటమిన్‌ బి–6 2.5 మి.గ్రా

ఫోర్టిఫైడ్‌ రైస్‌తో ఎంతో మేలు

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఫోర్టిఫైడ్‌ బియ్యం వాడకం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జిల్లావ్యాప్తంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. – బి.లావణ్యవేణి, జాయింట్‌ కలెక్టర్‌, ఏలూరు జిల్లా

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement